శనివారం 30 మే 2020
Sports - Apr 07, 2020 , 23:49:24

జడ్డూ.. గుర్రపు స్వారీకి సిద్ధమవు: ధవన్​

జడ్డూ.. గుర్రపు స్వారీకి సిద్ధమవు: ధవన్​

న్యూఢిల్లీ: టీమ్ఇండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాకు గుర్రపు స్వారీ అంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా జడ్డూ ఇప్పటికే చెప్పాడు. గతంలో తాను స్వారీ చేసిన వీడియోను ఇటీవలే ట్వీట్ చేశాడు. తాజాగా మంగళవారం మరోసారి తన ఇష్టాన్ని చెప్పాడు.

“నా గురించి నేను ఏం తెలుసుకోవాలో గుర్రం నాకు నేర్పింది” అని తన గుర్రం ఫొటోతో సహా ఇన్​స్టాగ్రామ్​లో జడేజ పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్​కు టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ స్పందించాడు. దేశంలో లాక్​డౌన్ పూర్తయ్యాక ఇద్దరం కలిసి గుర్రపు స్వారీ చేద్దామని చెప్పాడు. సిద్ధంగా ఉండాలంటూ ఎమోజీని జతచేశాడు. కరోనా వైరస్ కారణంగా లాక్​డౌన్ ఉండడంతో క్రికెటర్లందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. దీంతో పాటు వారి అభిప్రాయాలను, ఇష్టాలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. 


logo