సోమవారం 13 జూలై 2020
Sports - May 09, 2020 , 23:36:55

పోలీసులకు ‘విరుష్క’ సాయం

పోలీసులకు ‘విరుష్క’ సాయం

ముంబై: కరోనా వైరస్‌పై యుద్ధంలో ముందుండి పోరాడుతున్న పోలీసులకు అండగా నిలిచేందుకు భారత కెప్టెన్‌ విరా ట్‌ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ ముందుకొచ్చారు. ముంబై పోలీసుల సంక్షేమ నిధికి చెరో రూ.5 లక్షల విరాళమిచ్చారు. ఈ విషయాన్ని ముంబై పోలీస్‌ కమిషన్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ శనివారం  ట్వీట్‌  చేశారు.  కరోనాపై పోరాడుతున్న పోలీసులకు వారి సాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 

4వేల మందికి సచిన్‌ ఆర్థికసాయం

లాక్‌డౌన్‌ కారణంగా కష్టాలను ఎదుర్కొంటున్న 4వేల మంది అవసరార్థులకు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఆర్థిక సాయమందించాడు. ఈ మేరకు తమకు సచిన్‌  విరాళమిచ్చినట్టు ముంబైకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. పూటగడువని నిరుపేదలకు తోడు బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఈ సాయం అందనుంది. 


logo