గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 10, 2020 , 01:35:18

షఫాలీ కన్నీళ్లు బాధించాయి

 షఫాలీ కన్నీళ్లు బాధించాయి
  • బ్రెట్‌ లీ వ్యాఖ్య

మెల్‌బోర్న్‌: టీమ్‌ఇండియా యువ సంచలనం షఫాలీ వర్మ కన్నీరు పెట్టుకున్న దృశ్యాన్ని చూడడం తనకు బాధగా అనిపించిందని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ అన్నాడు. మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓడాక  షఫాలీ మైదానంలోనే ఏడ్చిన సంగతి తెలిసిందే. అయితే, ప్రపంచకప్‌ ప్రదర్శనతో షఫాలీ గర్వపడొచ్చని లీ సోమవారం చెప్పాడు. ‘ఆమె ఎంతో మెరుగై ఆస్ట్రేలియా నుంచి వెళుతున్నది. ఈ అనుభవం నుంచి నేర్చుకొని షఫాలీ మరింత బలంగా తిరిగివస్తుంది. మరోసారి ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు ఆమె భారీ స్కోర్లు చేసినా ఎవరూ ఆశ్చర్యపోవక్కర్లేదు’అని బ్రెట్‌ లీ అన్నాడు. 


ఒకటి నుంచి మూడుకు  

భారత యువ సంచలనం షఫాలీ వర్మ  ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం  నుంచి మూడో ర్యాంక్‌కు పడిపోయింది. మెగాటోర్నీలో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన ఆసీస్‌ హార్డ్‌హిట్టర్‌ బేత్‌ మూనీ(762) రెండు ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని టాప్‌ర్యాంక్‌కు చేరుకుంది. స్మృతి మందన,  జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌కౌర్‌ వరుసగా ఏడు, తొమ్మిది, పన్నెండు ర్యాంక్‌ల్లో ఉన్నారు.  


logo