శుక్రవారం 05 మార్చి 2021
Sports - Feb 15, 2021 , 00:36:26

థీమ్‌ ఔట్‌

థీమ్‌ ఔట్‌

  • దిమిత్రోవ్‌ చేతిలో ఓడిన డొమినిక్‌

మెల్‌బోర్న్‌: యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌, ఆస్ట్రియా యంగ్‌ గన్‌ డొమినిక్‌ థీమ్‌కు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో షాక్‌ ఎదురైంది. 18వ సీడ్‌ గ్రిగోర్‌ దిమిత్రోవ్‌ చేతిలో వరుస సెట్లలో అతడు అనూహ్య పరాజయం పాలయ్యాడు. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్‌ థీమ్‌ 4-6, 4-6, 0-6తో దిమిత్రోవ్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. శారీరక సమస్యల వల్ల 100 శాతం ప్రదర్శన చేయలేకపోయానని మ్యాచ్‌ అనంతరం థీమ్‌ చెప్పాడు. ప్రపంచ నంబర్‌ వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఓ సెట్‌ కోల్పోయినా చివరికి 7-6 (7/4), 4-6, 6-1, 6-4తో 14వ సీడ్‌ మిలోస్‌ రవోనిక్‌పై గెలిచాడు. మరో మ్యాచ్‌లో 6-4, 7-6 (7/5), 6-3తో డుసన్‌ లాజనోవిక్‌పై గెలిచిన అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)తో క్వార్టర్స్‌లో జొకో తలపడనున్నాడు. కాగా రష్యా క్వాలిఫయర్‌ అస్లాన్‌ కరెత్సేవ్‌ తన తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలోనే క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. 20వ సీడ్‌ అగర్‌ అలియాసిమీ (కెనడా)పై ఐదు సెట్ల పాటు పోరాడి 3-6, 1-6, 6-3, 6-3, 6-4తో అస్లాన్‌ గెలుపొందాడు. సెమీస్‌లో చోటు కోసం దిమిత్రోవ్‌తో అతడు తలపడనున్నాడు.  


VIDEOS

logo