సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Sep 09, 2020 , 20:22:14

కోహ్లితో పోల్చ‌డంలో అర్థం లేదు : డేవిడ్ మ‌ల‌న్‌

కోహ్లితో పోల్చ‌డంలో అర్థం లేదు : డేవిడ్ మ‌ల‌న్‌

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మ‌ల‌న్ టీ20ల్లో మెరుగ్గా రాణిస్తూ త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మ‌ల‌న్ ఇప్ప‌టివ‌ర‌కు 16 ఇన్నింగ్స్ ఆడి 7 అర్థ సెంచ‌రీలు, ఒక సెంచరీ చేయ‌డంతో అంతా అత‌డిని కోహ్లితో పోల్చుతున్నారు. దీంతో స్పందించిన మ‌ల‌న్ "నేను కేవ‌లం 16 ఇన్నింగ్స్ మాత్ర‌మే ఆడాను. న‌న్ను కోహ్లితో పోల్చ‌డంలో అర్థం లేదు. నేను విరాట్ ద‌రిదాపుల్లో కూడా లేను. క‌నీసం 50 మ్యాచ్‌లు ఆడినా న‌న్ను విరాట్‌తో పోల్చ‌వ‌చ్చు. కానీ నేను ఇంకా అంతవ‌ర‌కు వెళ్ల‌లేదు. కోహ్లి ఒక మేటి బ్యాట్స్‌మెన్ అత‌డిలా రికార్డులు సాధించాల‌ని అంద‌రికీ ఉంటుంది" అని అన్నాడు. 33 ఏండ్ల మ‌ల‌న్ ఇప్ప‌టివ‌ర‌కు 48.77 స‌గ‌టుతో 682 ప‌రుగులు చేశాడు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo