శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 03, 2020 , 15:55:48

అంపైర్‌ బూటును తాకిన జొకోవిచ్‌..14లక్షల జరిమానా!

అంపైర్‌ బూటును తాకిన జొకోవిచ్‌..14లక్షల జరిమానా!

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తనకు తిరుగులేదని నిరూపిస్తూ.. సెర్బియా వీరుడు నొవాక్‌ జొకోవిచ్‌ ఎనిమిదోసారి ట్రోఫీ చేజిక్కించుకున్నాడు.

మెల్‌బోర్న్‌:   ఆస్ట్రేలియా ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ సందర్భంగా ఛైర్‌ అంపైర్‌ పాదాన్ని తాకడంపై ఆస్ట్రేలియా ఓపెన్‌ ఛాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ స్పందించాడు. అంపైర్‌ పాదాన్ని తాకినందుకు తానెంతో చింతిస్తున్నట్లు తెలిపాడు. అంపైర్‌ షూను టచ్‌ చేసే సమయంలో తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని వివరణ ఇచ్చుకున్నాడు. నిజంగా స్నేహపూర్వకంగానే తాకానని చెప్పుకొచ్చాడు సెర్బియా వీరుడు. 

వరుసగా రెండు సార్లు జొకోవిచ్‌ నిర్ణీత సమయంలో సర్వీస్‌ చేయకపోవడంతో అంపైర్‌  డామియన్ డుముసోయిస్(ఫ్రెంచ్‌) సెర్బియా స్టార్‌ జొకోను హెచ్చరించాడు. రెండో సెట్‌లో 4-4తో సమంగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఐతే సహనం కోల్పోయిన నొవాక్‌ వెంటనే సెట్‌ ముగిశాక తన సీటులో కూర్చొనేందుకు వెళ్తుతూ  అంపైర్‌ ఛైర్‌ వద్దకు వచ్చి డామియన్‌ బూటుపై చేతితో కొడుతూ వెటకారంగా చూస్తూ.. ఈ మ్యాచ్‌లో నువ్వెంతో ఫేమస్‌ అయ్యేలా చేసుకున్నావు. గ్రేట్‌ జాబ్‌. మరీ ముఖ్యంగా రెండోది. వెల్‌డన్‌ మ్యాన్‌ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.  జొకో వ్యాఖ్యలపై అంపైర్‌ వెంటనే స్పందించలేదు. అఫిషియల్‌ గ్రాండ్‌ రూల్‌ బుక్‌ నియమావళి ప్రకారం నొవాక్‌కు భారీ జరిమానా విధించనున్నారు.  నిబంధనల ప్రకారం అతనికి సుమారు 14లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తనకు తిరుగులేదని నిరూపిస్తూ.. సెర్బియా వీరుడు నొవాక్‌ జొకోవిచ్‌ ఎనిమిదోసారి ట్రోఫీ చేజిక్కించుకున్నాడు. ఇప్పటివరకు మెల్‌బోర్న్‌లో ఆడిన ఏడు ఫైనల్స్‌లోనూ గెలుపొందిన జొకో.. ఆదివారం జరిగిన తుది పోరులో 6-4, 4-6, 2-6, 6-3, 6-4తో డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)పై విజయం సాధించాడు.


logo