బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Jan 30, 2020 , 17:11:59

ఫెడెక్స్ ఔట్‌.. ఫైన‌ల్లో జోకోవిచ్

ఫెడెక్స్ ఔట్‌.. ఫైన‌ల్లో జోకోవిచ్


హైద‌రాబాద్‌:  ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ మెన్స్ ఫైన‌ల్లో జోకోవిచ్ ప్ర‌వేశించాడు.  ఫెద‌ర‌ర్‌తో జ‌రిగిన సెమీస్‌లో జోకోవిచ్ వ‌రుస సెట్ల‌లో విజ‌యం సాధించాడు.  గ‌త ఏడాది చాంపియ‌న్‌గా నిలిచిన జోకో.. ఈ ఏడాది సెమీస్‌లో 7-6, 6-4, 6-3 స్కోర్‌తో ఫెడెక్స్‌పై విక్ట‌రీ కొట్టాడు. మెల్‌బోర్న్ ఈవెంట్‌లో స్విస్ మాస్ట‌ర్ ఫెద‌ర‌ర్‌పై.. సెర్బియా ప్లేయ‌ర్ జోక్ పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించాడు.  తొలి సెట్ టై బ్రేక‌ర్‌లో ఫెద‌ర‌ర్ గ‌ట్టి పోటీ ఇచ్చినా.. ఆ సెట్‌ను జోకో గెలుచుకున్నాడు. ఇక ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండు సెట్ల‌లోనూ జోకోవిచ్ గెలిచి.. ఫైన‌ల్లో ప్ర‌వేశించాడు.  ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఫైన‌ల్లోకి జోకోవిచ్ ప్ర‌వేశించ‌డం ఇది 8వ సారి కావ‌డం విశేషం. ఫెద‌ర‌ర్‌తో జ‌రిగిన మ్యాచుల్లో జోకో గెల‌వ‌డం ఇది 27వ సారి.  జోకోకు ఇది 26వ గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్ కానున్న‌ది.   


logo