శనివారం 04 జూలై 2020
Sports - Jul 01, 2020 , 01:05:20

ఆ అనుభూతిని వర్ణించలేను

ఆ అనుభూతిని వర్ణించలేను

  • సచిన్‌ను డకౌట్‌ చేయడంపై భువనేశ్వర్‌

న్యూఢిల్లీ: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను డకౌట్‌ చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటే ఇప్పటికీ తన రోమాలు నిక్కబొడుచుకుంటాయని టీమ్‌ఇండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ పేర్కొన్నాడు. 2008-09 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఉత్తరప్రదేశ్‌ తరఫున బరిలోకి దిగిన భువనేశ్వర్‌ కుమార్‌.. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను డకౌట్‌ చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో సచిన్‌కు అదే తొలి డకౌట్‌. ఆ సందర్భాన్ని భువనేశ్వర్‌ కుమార్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ‘సచిన్‌ను డకౌట్‌ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. అందులో అప్పటి యూపీ కెప్టెన్‌ మహమ్మద్‌ కైఫ్‌కు కూడా భాగస్వామ్యం ఉంది. అతడే ఆ ప్రదేశంలో ఫీల్డర్‌ను ఉంచాడు’ అని భువనేశ్వర్‌ చెప్పుకొచ్చాడు. కొవిడ్‌-19 విరామం తర్వాత తిరిగి క్రికెట్‌ మొదలైతే ఆటలో చాలా మార్పులు కనిపించొచ్చని భువీ అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా బంతి మెరుపు సరిగ్గా లేకుంటే బౌలర్‌ ఎంత ప్రయత్నించినా వికెట్‌ పడగొట్టడం కష్టమే అని.. బౌలర్ల సామర్థ్యం సగానికి పడిపోతుందని అన్నాడు.  


logo