గురువారం 26 నవంబర్ 2020
Sports - Nov 23, 2020 , 03:05:02

‘ నిరుత్సాహపడ్డా.. కానీ’

‘ నిరుత్సాహపడ్డా.. కానీ’

ముంబై: ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్లలో తనకు చోటు దక్కకపోవడం నిరుత్సాహాన్ని కలిగించిందని ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చెప్పాడు. అయితే కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో మాట్లాడాక మనసు కుదుటపడిందని అన్నాడు. దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్‌లోనూ నిలకడగా రాణిస్తున్న సూర్యకుమార్‌కు టీమ్‌ఇండియాలో మాత్రం అవకాశం రాలేదు. ఈ విషయంపై ఆదివారం ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడాడు.‘నేను చాలా నిరాశ చెందానని రోహిత్‌కు చెప్పా. అప్పుడు అతడు నాతో మాట్లాడాడు. నాకు నీపై నమ్మకముందని, ఐపీఎల్‌లో ఎలా ఆడావో అంతే అత్యుత్తమంగా ఆడుతూ ముందుకు సాగు అని రోహిత్‌ నాతో చెప్పాడు. సమయం బాగున్నప్పుడు అవకాశమొస్తుందని, ఈ రోజైనా, రేపైనా చాన్స్‌ వచ్చి తీరుతుందని ధైర్యం చెప్పాడు’ అని సూర్య కుమార్‌ యాదవ్‌ తెలిపాడు. హిట్‌మ్యాన్‌ మాటలతో తనలోని నిరుత్సాహం మొత్తం పోయి, ఎంతో శక్తి నిండిందని సూర్య పేర్కొన్నాడు.