గురువారం 21 జనవరి 2021
Sports - Dec 23, 2020 , 22:37:12

తమిళనాడు జట్టుకు సారథిగా దినేశ్‌ కార్తీక్‌

తమిళనాడు జట్టుకు సారథిగా  దినేశ్‌ కార్తీక్‌

చెన్నై: టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ దేశవాళీ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టీ20 టోర్నీలో బరిలో దిగనున్నాడు. టోర్నమెంట్‌లో తమిళనాడు జట్టుకు కార్తీక్‌ సారథ్యం వహించనున్నాడు. జనవరి 10 నుంచి కోల్‌కతా వేదికగా టోర్నీ ఆరంభంకానుంది. ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.  జట్టులో యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు.  ఎలైట్‌ గ్రూప్‌-బీలో తమిళనాడు జట్టు ఉంది.  గురువారం నుంచి ప్రాక్టీస్‌ ప్రారంభించనున్న జట్టు..జనవరి 2న కోల్‌కతా వెళ్లనుంది. 


logo