శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Oct 05, 2020 , 01:39:15

కార్తీక్‌ వారి తర్వాతే రావాలి: గౌతీ

కార్తీక్‌ వారి తర్వాతే రావాలి: గౌతీ

షార్జా: ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓటమి పాలైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. గెలిచే మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకున్న కోల్‌కతా.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేసుకుంటే బాగుంటుందని ఓ ఇంటర్వూలో  సూచించాడు. ముఖ్యంగా ఢిల్లీతో మ్యాచ్‌లో ఐదో స్థానంలో వచ్చి తీవ్రంగా నిరాశపరిచిన కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌.. రస్సెల్‌, మోర్గాన్‌ తర్వాత బ్యాటింగ్‌కు రావాలని పేర్కొన్నాడు. దీంతో పాటు టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తున్న మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ లోయరార్డర్‌లో దింపాలని అన్నాడు. కోల్‌కతాకు కార్తీక్‌ కాకుండా ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌ అందించిన మోర్గాన్‌ కెప్టెన్‌ అయితే బాగుంటుందని భారత పేసర్‌ శ్రీశాంత్‌ అభిప్రాయపడ్డాడు.