శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Jul 30, 2020 , 11:08:44

యూఎస్ ఓపెన్​కు ప్రపంచ టాప్​ర్యాంకర్ బార్టీ దూరం

యూఎస్ ఓపెన్​కు ప్రపంచ టాప్​ర్యాంకర్ బార్టీ దూరం

న్యూయార్క్​: కరోనా వైరస్ ఆందోళన నేపథ్యంలో యూఎస్ ఓపెన్ గ్రాండ్​స్లామ్ టెన్నిస్ టోర్నీ నుంచి మహిళల సింగిల్స్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ ఆష్లే బార్టీ(ఆస్ట్రేలియా) తప్పుకుంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 31వ తేదీ నుంచి న్యూయార్క్ వేదికగా ఈ టోర్నీ జరుగాల్సి ఉంది. అమెరికాలో కరోనా తీవ్రత అధికంగా  ఉన్నా.. పోటీలను జరుపేందుకే నిర్వాహకులు సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు ప్రపంచ అగ్రర్యాంకర్ బార్టీ తప్పుకోవడం యూఎస్​ ఓపెన్​కు ఎదురుదెబ్బగా మారింది.

“ ఈ ఏడాది వెస్ట్రన్​, సథరన్​ ఓపెన్​, యూఎస్ ఓపెన్ టోర్నీల కోసం అమెరికాకు వెళ్లకూడదని నాతో పాటు నా బృందం నిర్ణయించుకుంది. ఆ టోర్నీలు అంటే నాకు ఇష్టం. ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. కాకపోతే కరోనా కారణంగా ప్రమాదం పొంచి ఉంది. అందుకే నా బృందాన్ని రిస్క్​లో పెట్టదలుచుకోలేదు. టోర్నీ నిర్వహణ కోసం అమెరికా టెన్నిస్ సంఘానికి ఆల్​ ది బెస్ట్​. వచ్చే ఏడాది యూఎస్ ఓపెన్​లో పాల్గొనేందుకు వేచిచూస్తుంటా” అని బార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న పురుషుల సింగిల్స్ టాప్ ర్యాంకర్​ నొవాక్ జొకోవిచ్ సైతం యూఎస్ ఓపెన్​లో పాల్గొనడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పిన విషయం తెలిసిందే.  


logo