సోమవారం 30 నవంబర్ 2020
Sports - Nov 12, 2020 , 18:42:14

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన మారడోనా

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన మారడోనా

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. బ్రెయిన్‌ సర్జరీ విజయవంతంకావడంతో బ్యూనస్‌ ఎయిర్స్‌లోని ఆస్పత్రి నుంచి బుధవారం ఆయనను పునరావాస కేంద్రానికి తరలించారు.  అక్టోబర్‌ 30తో 60ఏండ్లు పూర్తి చేసుకున్న మారడోనా మెదడులో రక్తం గడ్డకట్టడంతో గతవారం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. 

ఫుట్‌బాల్‌ లెజెండ్‌ మారడోనా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని అతని న్యాయవాది మాటియస్‌ మోర్లా తెలిపారు.    తన జీవితంలో మారడోనాకు ఇది కష్టమైన సమయం అని న్యాయవాది అన్నారు. అర్జెంటీనా జట్టుకి మారడోనా 1986లో ఫుట్‌బాల్‌  ప్రపంచకప్‌ అందించారు.