బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 23, 2020 , 17:06:15

మా వాళ్ల ప్రదర్శన నచ్చలేదు : షోయబ్‌అక్తర్‌

మా వాళ్ల ప్రదర్శన నచ్చలేదు : షోయబ్‌అక్తర్‌

లాహోర్ : సౌతాంప్టన్‌లోని అగాస్ బౌల్‌లో పాకిస్థాన్‌, ఇగ్లండ్ ‌జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టులో పాకిస్తాన్ ప్రదర్శనపై షోయబ్‌ అక్తర్‌ అసహనం వ్యక్తం చేశాడు. 

జాక్ క్రాలీ (267), జోస్ బట్లర్ (152) పరుగులు చేయగా వీరిద్దరూ ఐదో వికెట్‌కు 359 పరుగులు చేశారు. మ్యాచ్‌పై నియంత్రణ కోల్పోయిన పాక్.. ‌మొదటి రోజు చివరి వరకు 24 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. 

ఈ సందర్భంగా అక్తర్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ ‘ఇగ్లండ్‌ బౌలర్లలో దూకుడు చూశాను. వారికి వికెట్లు తీసే ఉద్దేశం ఉంది. పాకిస్తాన్ మరి ప్రస్తుత బౌలర్లకు ఏమి బోధిస్తున్నదో నాకు తెలియదు. వారి వద్ద దూకుడు పద్ధతి లేదు. నసీమ్ షా కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే బౌలింగ్‌ చేస్తున్నాడు. బంతులు నెమ్మదిగా, బౌన్సర్లు వేసేవారు లేరు’ అని అన్నాడు. ‘మా బౌలర్లలో దూకుడు ఎందుకు లేదో నాకు అర్థం కావడం లేదు. మీరు నెట్ బౌలర్లు కాదు.. టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతున్నారు’ అని అక్తర్‌ తెలిపాడు. 

‘సరైన మనస్తత్వం లేనప్పుడు. మీరు విజయం సాధించలేరు. పాకిస్తాన్ చాలా సాధారణ జట్టులాగా ఉంది.’ అని షోయబ్‌ అన్నాడు. 'ఇది పాకిస్తాన్ నుంచి చాలా ఇబ్బందికరమైన ప్రదర్శన. ఈ సిరీస్‌లో మా జట్టు మంచి ప్రదర్శన కనబరుస్తుందని నేను ఆశాభావంతో ఉన్నాను. పాకిస్తాన్ క్లబ్ జట్టులా కనిపిస్తోంది. క్రాలీ 300 పరుగులు చేసేవాడు. కాని అదృష్టవశాత్తూ అతను అవుట్ అయ్యాడు’ అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo