బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 23, 2020 , 12:23:35

ధోనీ భారీ సిక్స‌ర్‌.. బంతిని తీసుకెళ్లిన అభిమాని- వీడియో

ధోనీ భారీ సిక్స‌ర్‌.. బంతిని తీసుకెళ్లిన అభిమాని- వీడియో

హైద‌రాబాద్‌: షార్జా స్టేడియంలో భారీ సిక్స‌ర్ల‌తో ధోనీ త‌న ప‌వ‌ర్ చూపించినా.. రాజ‌స్థాన్‌తో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై జట్టుకు మాత్రం ఓట‌మి త‌ప్ప‌లేదు.  ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌లో ధోనీ ఓ సిక్స‌ర్‌ను 92 మీట‌ర్ల దూరం కొట్టాడు. ఆ సిక్స‌ర్ కాస్తా.. షార్జా స్టేడియం బ‌య‌ట‌ప‌డింది.  స్టేడియం మీదుగా వెళ్లిన ఆ బంతి.. స‌మీపంలో ఉన్న వీధుల్లో ప‌డింది.  అయితే అక్క‌డే ఉన్న ఓ క్రికెట్ అభిమాని ఆ బంతిని ప‌ట్టుకుని.. న‌వ్వుకుంటూ వెళ్లిపోయాడు.  దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్టు చేశారు.  సౌదీలో జ‌రుగుతున్న ఐపీఎల్ టోర్నీ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై  నెగ్గిన ధోనీ సేన‌కు రాజ‌స్థాన్ చేతిలో అనూహ్య ఓట‌మి ఎదురైంది. మంగ‌ళ‌వారం తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల‌కు 216 ప‌రుగుల స్కోర్ చేసింది.  భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన చెన్నై జ‌ట్టు.. క్ర‌మంగా వికెట్లు కోల్పోవ‌డంతో ల‌క్ష్యానికి 16 ప‌రుగుల దూరంలో నిలిచిపోయింది.  అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ హ్యాట్రిక్ సిక్స‌ర్లు కొట్టాడు. అంతే కాదు,  హై స్కోర్ గేమ్‌గా నిలిచిన ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు బ్యాట్స్‌మెన్లు మొత్తం 33 సిక్స‌ర్లు బాదారు. ఐపీఎల్ మ్యాచ్ హిస్ట‌రీలో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్ట‌డం రికార్డే. 


  


logo