గురువారం 09 జూలై 2020
Sports - May 14, 2020 , 15:39:53

ధోనీ ద‌మ్మున్న నాయ‌కుడు: డుప్లెసిస్‌

ధోనీ ద‌మ్మున్న నాయ‌కుడు:  డుప్లెసిస్‌

చెన్నై:  టీమ్ఇండియా మాజీ  కెప్టెన్ మ‌హేంద్రసింగ్ ధోనీ ద‌మ్మున్న నాయ‌కుడ‌ని.. అత‌డు ఫీల్డ్‌లో అనూహ్యంగా తీసుకునే నిర్ణ‌యాలే అత‌డి విజ‌య ర‌హ‌స్యాల‌ని ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ అన్నాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్రాంచైజీ త‌ర‌ఫున ధోనీ సార‌థ్యంలో ఆడుతున్న డుప్లెసిస్‌.. త‌న కెప్టెన్‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు. 

`కెప్టెన్ అంటే త‌ర‌చూ జ‌ట్టు స‌మావేశాలు పెట్టి అందులో సుదీర్ఘ ఉప‌న్యాసాలు ఇవ్వాలేమో అనుకునేవాడిని. కానీ ధోనీని చూశాక తెలిసింది. అస‌లైన సార‌థి ఏం చేయాలో. అత‌డు ఎప్పుడు అన‌వ‌స‌ర మీటింగ్‌లు పెట్ట‌డు. అత‌డి క్రికెట్ బుర్ర‌కు ఎవ‌రైనా జోహార్ అనాల్సిందే. పాద‌ర‌సం క‌న్నా వేగంగా ఆలోచిస్తాడు. ఫీల్డ్‌లో తీసుకోవాల్సిన నిర్ణ‌యాల‌పై అత‌డికి స‌రైన అవ‌గాహ‌న ఉంటుంది. దానికి త‌గ్గ‌ట్లే ముందుకు సాగుతాడు. మైదానంలో నిర్ణయాలు తీసుకునే స‌మ‌యంలో ఏ మాత్రం సంకోచించ‌డు ఆ గ‌ట్సే ధోనీని ద‌మ్మున్న నాయ‌కుడిగా ముందు వ‌ర‌సులో నిల‌బెడ‌తాయి` అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.logo