ఆదివారం 07 జూన్ 2020
Sports - Mar 28, 2020 , 23:46:36

ధోనీ ఆశలు ఆవిరే: హర్ష భోగ్లే

ధోనీ ఆశలు ఆవిరే: హర్ష భోగ్లే

న్యూఢిల్లీ: భారత జట్టుకు ధోనీ ఆడే అవకాశాలపై మాజీ క్రికెటర్లకు తోడు వ్యాఖ్యాతల విశ్లేషణ కొనసాగుతూనే ఉన్నది. కరోనా వైర స్‌ కారణంగా ఐపీఎల్‌ 13వ సీజన్‌ జరుగడం పై సందిగ్ధత ఏర్పడిన నేపథ్యంలో ధోనీ ఇక జాతీయ జట్టుకు ఆడేది ఇక అనుమానమేనని ప్రముఖ వ్యాఖ్యాత హర్షభోగ్లే అన్నాడు. ‘టీమ్‌ఇండియాలోకి తిరిగి వచ్చేందుకు ధోనీకి దారులుమూసుకుపోయినట్లే. సెప్టెంబర్‌-అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు మహీ ఎంపికయ్యే అవకాశాలు తక్కువని నా గట్టి నమ్మకం’ అని భోగ్లే అన్నాడు. గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ తర్వాత నుంచి ఈ సీనియర్‌ క్రికెటర్‌ జాతీయ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. logo