శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 10, 2020 , 12:39:19

మ్యాచ్ ఓడినందుకు.. ధోనీ కూతురిపై ట్రోలింగ్

మ్యాచ్ ఓడినందుకు.. ధోనీ కూతురిపై ట్రోలింగ్

హైద‌రాబాద్‌: ఆన్‌లైన్ ట్రోలింగ్ వికృతంగా మారింది. అకృత్యాల‌కు, అస‌భ్య దూష‌ణ‌ల‌కు అది అడ్డ‌గా మారింది.  మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేస్తూ.. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న దారుణాలు, వేధింపులు విప‌రీతంగా ఉన్నాయి.  రెండు రోజుల క్రితం జ‌రిగిన‌ ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై టీమ్ కోల్‌క‌తా జ‌ట్టు చేతిలో 10 ర‌న్స్ తేడాతో ఓట‌మి పాలైంది.  అయితే ఆ మ్యాచ్‌లో కెప్టెన్ ధోనీ కేవ‌లం 11 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. ధోనీ వైఫ‌ల్యం చెంద‌డం వ‌ల్ల‌.. ఆన్‌లైన్ యూజ‌ర్లు చెన్నై కెప్టెన్‌పై తిట్ల వ‌ర్షం కురిపించారు.  ధోనీతో పాటు ఆయ‌న భార్య సాక్షి ఇన్‌స్టా అకౌంట్ల‌లో ట్రోలింగ్ జ‌రిగింది.  కేవ‌లం ధోనీపై మాత్ర‌మే కాదు.. చాలా జిగుప్సాక‌ర‌మైన రీతిలో అత‌ని కూతురుపై కూడా కామెంట్లు చేస్తూ వేధింపుల‌కు పాల్ప‌డ్డారు.  అయిదేళ్ల జీవాను టార్గెట్ చేస్తూ ధోనీని బెదిరించారు.  రేప్‌, లైంగిక దాడి వంటి హేయాతిహేయ‌మైన కామెంట్ల‌తో ట్రోలింగ్ చేశారు.   

ధోనీ కూతురు జీవాపై అనుచిత కామెంట్లు చేయ‌డం ప‌ట్ల కొంద‌రు ఆన్‌లైన్ యూజ‌ర్లు షాక్‌కు గుర‌య్యారు. అయిదేళ్ల చిన్నారిని టార్గెట్ చేస్తూ ఆన్‌లైన్‌లో జ‌రుగుతున్న‌ వేధింపుల‌తో కొంద‌రు క‌ల‌త చెందారు. ఇండియాలో లైంగిక దాడి ఘ‌ట‌న‌లు ఎక్కువ అవుతున్న త‌రుణంలో.. తాజాగా ఆన్‌లైన్‌లో జ‌రుగుతున్న ట్రోలింగ్ మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. ఎన్‌సీఆర్‌బీ డేటా ప్ర‌కారం 2019లో ప్ర‌తి రోజూ 87 రేప్ కేసులు న‌మోదు అయిన‌ట్లు తెలుస్తోంది.