సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Sep 07, 2020 , 19:23:25

ధోని సాహ‌సోపేత నిర్ణ‌యం.. 19నే ముంబైతో బ‌రిలోకి

ధోని సాహ‌సోపేత నిర్ణ‌యం.. 19నే ముంబైతో బ‌రిలోకి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఏ కెప్టెన్ తీసుకోని నిర్ణ‌యాన్ని ధోని తీసుకున్నాడు. జ‌ట్టులో ఆట‌గాళ్ల‌తో స‌హా సిబ్బందికి క‌రోనా సోక‌డంతో 19న ముంబైతో ప్రారంభ మ్యాచ్ ఆడ‌టానికి బ‌దులు 23న త‌మ మొద‌టి మ్యాచ్ ఆడే అవ‌కాశాన్ని ఐపీఎల్ క‌ల్పించింది. కానీ ధోని మాత్రం త‌మ జ‌ట్టు 19నే బ‌రిలోకి దిగుతుంద‌ని తెలిపాడ‌ట‌. 

ఐపీఎల్ షురూ అయిన త‌రువాత 5వ రోజు సీఎస్‌కే త‌మ మొద‌టి మ్యాచ్ ఆడ‌వ‌చ్చున‌ని చైర్మన్ బ్రిజేశ్ పటేల్ ధోని సేన‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్లు తెలిపారు. దీనివ‌ల్ల జ‌ట్టును సిద్ధం చేసుకోవ‌డానికి మ‌రింత స‌మ‌యం వారికి కల్పించిన‌ట్లు ఉంటుంద‌ని బ్రిజేశ్ పేర్కొన్నారు. కానీ సిఎస్‌కే కెప్టెన్ ధోని ఈ ప్రతిపాదనను తిరస్కరించాడు. ముంబై ఇండియన్స్‌తో ప్రారంభ మ్యాచ్ ఆడ‌టానికి జ‌ట్టును సిద్ధం చేస్తున్నామ‌ని ధోని తెలిపాడ‌ట‌. సెప్టెంబర్ 19న తొలి ఆట ప్రారంభమయ్యే నాటికి సమస్యలన్నింటినీ అధిగమిస్తామ‌ని ధోని కాన్ఫిడెంట్‌గా ఉన్నాడ‌ట. దీంతో సీఎస్‌కే ఐపీఎల్ ప్రారంభ‌మైన ఆరు రోజుల్లో మూడు మ్యాచ్‌లు ఆడే ఏకైక జ‌ట్టుగా నిలువ‌నుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo