బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Sep 15, 2020 , 18:36:29

కాలర్‌ ఎగరేస్తున్న ధోని, వాట్సన్‌.. సీఎస్‌కే జెర్సీ వీడియో

కాలర్‌ ఎగరేస్తున్న ధోని, వాట్సన్‌.. సీఎస్‌కే జెర్సీ వీడియో

ఐపీఎల్‌-2020 ప్రారంభానికి ముందే సీఎస్‌కే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. కానీ జట్టు ఫ్రాంచైజీ మాత్రం త్వరలో అన్నీ సర్దుకుంటాయని చెప్తూ వస్తోంది. జట్టు ఆటగాళ్లు కూడా సెప్టెంబర్‌ 19న ముంబైతో జరుగనున్న తొలి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. సీఎస్‌కే మంగళవారం తమ తాజా జెర్సీకి సంబంధించిన వీడియోను అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో ఎంఎస్ ధోని, షేన్ వాట్సన్, మురళీ విజయ్ కాలర్‌ ఎగరేస్తూ వేసిన స్టెప్‌ చెన్నై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీడియో పోస్టు చేసిన నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో లైకులు, రీట్వీట్లు వచ్చాయి.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo