శనివారం 11 జూలై 2020
Sports - Apr 16, 2020 , 12:36:17

దాదాలానే.. ధోనీ కూడా: జ‌హీర్‌

దాదాలానే.. ధోనీ కూడా: జ‌హీర్‌

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా మాజీ సార‌థులు సౌర‌వ్ గంగూలీ, మ‌హేంద్ర‌సింగ్ ధోనీలో చాలా ద‌గ్గ‌రి పోలిక‌లున్నాయిని.. యువ‌కుల‌కు అండ‌గా నిలిచే విష‌యంలో వారిద్ద‌రూ దాదాపు ఒకే విధంగా ఆలోచిస్తార‌ని భార‌త మాజీ పేస‌ర్ జ‌హీర్ ఖాన్ అన్నాడు. కెరీర్ ఆరంభంలో త‌మ‌కు దాదా నుంచి ఎలాంటి మ‌ద్ద‌తు ల‌భించింది.. ఆ త‌ర్వాతి త‌రానికి ధోనీ నుంచి అలాంటి స‌హ‌కార‌మే అందింద‌ని జాక్ పేర్కొన్నాడు. ప్ర‌తి ప‌దేండ్ల‌కు ఒక‌సారి భార‌త క్రికెట్‌లో నాయ‌క‌త్వ మార్పు స‌హ‌జ‌మ‌ని.. జ‌హీర్ చెప్పుకొచ్చాడు. 

`వాళ్లిద్ద‌రూ (గంగూలీ, ధోనీ) జ‌ట్టుకు చాలాకాలంపాటు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇద్ద‌రిలో చాలా సారూప్య‌త‌లు ఉన్నాయి. కెరీర్ తొలినాళ్ల‌లో దాదా ఇచ్చిన మ‌ద్ద‌తు మ‌రువ‌లేను. అయితే ధోనీ చేతికి ప‌గ్గాలు వ‌చ్చిన‌ప్పుడు జ‌ట్టులో అంతా సీనియ‌ర్ ఆట‌గాళ్లు ఉన్నారు. అంత‌ర్జాతీయ స్థాయిలో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభ‌వం ఉన్న‌వాళ్ల‌ను ముందుకు న‌డిపించ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. కానీ ఒక్కొక్క‌రుగా సీనియ‌ర్లు త‌ప్పుకుంటుంటే.. అప్పుడు యువ ఆట‌గాళ్ల‌కు మార్గ‌నిర్దేశం చేసుకుంటూ జ‌ట్టును ముందుకు సాగించిన తీరు అద్భుతం. భార‌త క్రికెట్‌లో ప్ర‌తి ప‌దేండ్ల‌కు నాయ‌క‌త్వ మార్పు జ‌రుగుతుంది`అని జ‌హీర్ అన్నాడు.


logo