సోమవారం 13 జూలై 2020
Sports - May 07, 2020 , 16:35:25

ధోనీ గ‌ది త‌లుపులు తెరిచే ఉంటాయి: నెహ్రా

ధోనీ గ‌ది త‌లుపులు తెరిచే ఉంటాయి:  నెహ్రా

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ త‌క్కువ మాట్లాడుతాడనుకోవ‌డం పొర‌పాట‌ని.. భార‌త మాజీ పేస‌ర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. మ్యాచ్‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో అత‌డు ప్ర‌తి ఒక్క ఆడ‌ట‌గాడితో మాట్లాడుతాడ‌ని.. అర్ధ‌రాత్రి పూట కూడా అత‌డి గ‌ది త‌లుపులు తెరిచే ఉంటాయ‌ని నెహ్రా గుర్తు చేసుకున్నాడు. 

`మ‌హీ త‌క్కువ మాట్లాడుతాడ‌నుకోవ‌డం పొర‌పాటు. మ్యాచ్ రోజు రాత్రి అత‌డి గ‌ది త‌లుపు తెరిచే ఉంటుంది. ఎవ‌రు ఎలాంటి స‌మ‌స్య‌తోనైనా అత‌డి త‌లుపు త‌ట్టొచ్చు. ఎలాంటి అభ్యంత‌రాలు లేకుండా స‌మ‌స్య పూర్తిగా వింటాడు. అంతే కాదు చ‌క్క‌టి సూచ‌న‌లు కూడా చేస్తాడు` అని నెహ్రా అన్నాడు. గతేడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్ అనంత‌రం మ‌హీ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న విష‌యం తెలిసిందే.


logo