బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 12, 2020 , 09:50:21

సాయి సన్నిధిలో ధోనీ

సాయి సన్నిధిలో ధోనీ

మహేంద్రసింగ్‌ ధోనీ పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

హైదరాబాద్‌: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ధోనీ బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి ట్రస్టు సభ్యుడు రత్నాకర్‌ మహీకి స్వాగతం పలికి పుట్టపర్తి విశిష్టత, సత్యసాయి సేవలను వివరించారు. అనంతరం ధోనీ సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. అనంతరం సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులు ఎమ్మెస్‌ని ఘనంగా సన్మానించారు.  ధోనీ పుట్టపర్తికి వచ్చాడని తెలుసుకున్న అభిమానులు అతన్ని చూడటానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.  గతేడాది వన్డే ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌ తర్వాత భారత్‌  తరఫున ధోనీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. logo