మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 08, 2020 , 17:29:15

‘అప్పటి వరకు జట్టులో ఉంటానని ధోనీ చెప్పాడు’

‘అప్పటి వరకు జట్టులో ఉంటానని ధోనీ చెప్పాడు’

ముంబై: జట్టులో అత్యంత వేగంగా పరుగెత్తే వ్యక్తిగా ఉన్నంత కాలం తాను అంతర్జాతీయ క్రికెట్​లో కొనసాగుతానని టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనతో చెప్పాడని కామెంటేటర్​ సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు. జట్టులో ఫాస్టెస్ట్ స్ప్రింటర్​గా ఉంటేనే అంతర్జాతీయ క్రికెట్​కు తాను ఫిట్​గా ఉన్నట్టు అనుకుంటానని తనతో మహీ అన్నాడని ఓ టీవీ షోలో మంజ్రేకర్ వెల్లడించాడు.

“విరాట్ కోహ్లీ పెళ్లికి హాజరైన సమయంలో ధోనీ నాతో మాట్లాడాడు. ‘జట్టులో అత్యంత వేగంగా పరుగెత్తే వ్యక్తి(ఫాస్టెస్ట్ స్ప్రింటర్​)గా ఉన్నంత కాలం అంతర్జాతీయ క్రికెట్​ ఆడేందుకు ఫిట్​గా ఉన్నట్టు నన్ను నేను పరిగణించుకుంటా’ అని చెప్పాడు. టెండూల్కర్​, ధోనీ లాంటి వారు చాంపియన్ క్రికెటర్లు. ధోనీ మైదానంలోనే కాక ఎక్కడా ఫిట్​నెస్​ లేకుండా కనబడలేదు’ అని మంజ్రేకర్ చెప్పాడు. అలాగే ఈ ఏడాది ఐపీఎల్​లో ధోనీ తప్పకుండా అదరగొడతాడని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ తర్వాతి నుంచి అంతర్జాతీయ క్రికెట్​కు ధోనీ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది యూఏఈ వేదిగకా జరిగే ఐపీఎల్ కోసం రాంచీలోని తన ఇంట్లో ధోనీ ఇటీవలే ప్రాక్టీస్ ప్రారంభించాడు. 


logo