ఆదివారం 12 జూలై 2020
Sports - Apr 14, 2020 , 19:50:13

అత‌డిలో ఇంకా చాలా క్రికెట్ దాగుంది

అత‌డిలో ఇంకా చాలా క్రికెట్ దాగుంది

ధోనీ వ‌య‌సు పెరుగుతున్న‌ట్లు లేదంటున్న సురేశ్ రైనా

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంద‌ని.. సీనియ‌ర్ బ్యాట్స్‌మ‌న్ సురేశ్ రైనా పేర్కొన్నాడు. అత‌డి ఆట‌తీరుపై వ‌య‌సు ఏమాత్రం ప్ర‌భ‌వం చూప‌డం లేద‌ని ఆయ‌న అన్నాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌కు ముందు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ కోసం ఏర్పాటు చేసిన శిక్ష‌ణ శిబిరంలో ధోనీ దుమ్మురేపాడని రైనా చెప్పాడు. భారీ సిక్స‌ర్లు బాద‌డంలో మ‌హీకి సాటిలేర‌ని అన్నాడు. మంగ‌ళ‌వారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో త‌న సార‌థికి రైనా మ‌ద్ద‌తు తెలిపాడు.

`ధోనీ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడిలో ఇంకా చాలా క్రికెట్ ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్ సంద‌ర్భంగా అత‌డు భారీ సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. మూడుగంట‌ల‌పాటు నిర్వారామంగా ప్రాక్టీస్ కొన‌సాగించాడు. చెన్నైలాంటి ప‌ట్ట‌ణాల్లో అది ఎంత క‌ష్ట‌మో తెలుసా. న‌న్నెవ‌రైనా అడిగితే మ‌హీభాయ్ బ్యాటింగ్ సూప‌ర్ అనే చెబుతా. అత‌డిని చూస్తే.. వ‌య‌సు పెరుగుతున్న‌ట్లు అనిపించ‌డం లేదు` అని రైనా చెప్పుకొచ్చాడు.


logo