సోమవారం 23 నవంబర్ 2020
Sports - Sep 24, 2020 , 01:30:05

‘ధోనీ సిక్సర్‌' బంతి జాడ దొరికిందోచ్‌

 ‘ధోనీ సిక్సర్‌' బంతి జాడ దొరికిందోచ్‌

న్యూఢిల్లీ: వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ ధోనీ సిక్సర్‌ ఇప్పటికీ అభిమానుల మదిలో మెదులుతూనే ఉన్నది. నువాన్‌ కులశేఖర బౌలింగ్‌లో లాంగ్‌ఆన్‌ దిశగా ధోనీ కొట్టిన సిక్స్‌తో భారత్‌ రెండో సారి ప్రపంచకప్‌ను ఒడిసిపట్టుకున్నది. 28 ఏండ్ల తర్వాత సొంతగడ్డపై తమ కలల కప్‌ను ధోనీసేన ముద్దాడింది. అయితే ధోనీ సిక్స్‌ బాదిన బంతి కోసం ఆ రోజు ఎంత వెతికినా..ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌(ఎంసీఏ) కనుగొనలేకపోయింది. ఇది జరిగి తొమ్మిదేండ్లు పూర్తయ్యాక ఇప్పుడు ఆ బంతి జాడ తెలిసిందట. ఆ బాల్‌ను ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తిని భారత దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ కనుగొని ఎంసీఏకు సమాచారమందించాడు. హాంకాంగ్‌కు చెందిన వ్యక్తి దగ్గర బంతి ఉందని గవాస్కర్‌ తెలిపాడని ఎంసీఏ కౌన్సిల్‌ సభ్యుడు అజింక్య నాయక్‌ వెల్లడించాడు. సన్నీ సాయంతో బంతిని తీసుకొని వాంఖడే స్టేడియంలో మ్యూజియం ఏర్పాటు చేసినప్పుడు అందులో ఉంచుతామని అన్నాడు. అలాగే ఆ బంతి పడిన సీట్‌ నంబర్‌ 210ని ధోనీకి గౌరవ సూచకంగా తీర్చిదిద్ది ఖాళీగా ఉంచాలని యోచిస్తున్నట్టు నాయక్‌ వెల్లడించాడు.