బుధవారం 27 జనవరి 2021
Sports - Jan 04, 2021 , 13:18:39

ధోనీ ఫార్మౌజ్‌లో కూర‌గాయ‌లు సాగు.. దుబాయ్‌కి ఎగుమ‌తి

ధోనీ ఫార్మౌజ్‌లో కూర‌గాయ‌లు సాగు.. దుబాయ్‌కి ఎగుమ‌తి

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ.. త‌న ఫార్మౌజ్‌లో వ్య‌వ‌సాయం చేస్తున్నారు.  జార్ఖండ్‌లోని రాంచీలో ఉన్న  ఆ ఫార్మౌజ్‌లో దాదాపు ప‌ది ఎక‌రాల్లో క్రికెట‌ర్ ధోనీ పంట‌లు పండిస్తున్నారు. అయితే త‌న ఫార్మౌజ్‌లో కాస్తున్న కూర‌గాయ‌ల్ని ... విదేశాల్లో అమ్మేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.  రాంజీ ఫార్మౌజ్ దాదాపు 43 ఎక‌రాలు ఉంటుంది.  దాంట్లో ప‌ది ఎక‌రాల్లో ధోనీ ఆర్గానికి పంట‌లు పండిస్తున్నారు.  క్యాబేజీ, ట‌మాటోలు, స్ట్రాబెర్రీలు, బ‌ఠాణీల‌ను ధోనీ సాగు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫార్మౌజ్‌లో పండుతున్న క్యాబేజీలు, ట‌మాటోల‌కు.. రాంచీ లోక‌ల్ మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇక నుంచి  త‌మ వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల్ని.. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో అమ్మేందుకు ధోనీ రెడీ అయ్యారు. దుబాయ్ మార్కెట్‌లో ఆ కూర‌గాయ‌ల్ని అమ్మ‌నున్నారు.  రాంచీ నుంచి అరేబియా దేశాల‌కు ధోనీ పండిస్తున్న కూర‌గాయ‌ల్ని త‌ర‌లించేందుకు జార్ఖండ్ వ్య‌వ‌సాయ‌శాఖ బాధ్య‌త‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.  


logo