ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 09, 2020 , 01:40:07

ఫాస్టెస్ట్‌ స్ప్రింటర్‌గా ఉన్నంత కాలం.. జట్టులో ఉంటానని ధోనీ చెప్పాడు: మంజ్రేకర్‌

ఫాస్టెస్ట్‌ స్ప్రింటర్‌గా ఉన్నంత కాలం.. జట్టులో ఉంటానని ధోనీ చెప్పాడు: మంజ్రేకర్‌

  • జట్టులో ఉంటానని ధోనీ చెప్పాడు: మంజ్రేకర్‌  

ముంబై: జట్టులో అందరికంటే వేగంగా పరిగెత్తగలిగినంత కాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతానని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ తనతో చెప్పినట్లు భారత మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. ‘కోహ్లీ పెండ్లికి హాజరైన సమయంలో ధోనీ నాతో మాట్లాడుతూ.. జట్టులో ఫాస్టెస్ట్‌ స్ప్రింటర్‌గా ఉన్నంత కాలం అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నట్లు పరిగణించుకుంటా అని చెప్పాడు. మైదానంలోనే కాకుండా బయట కూడా మహీ ఫిట్‌గా లేనట్లు ఎప్పుడూ కనిపించలేదు’ అని మంజ్రేకర్‌ శనివారం ఓ టీవీ షోలో అన్నాడు.


logo