బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 15, 2020 , 20:46:16

జార్ఖండ్ డైన‌మైట్.. మిస్ట‌ర్ కూల్‌.. ఫుల్‌స్టాప్ పెట్టేశాడు..

జార్ఖండ్ డైన‌మైట్.. మిస్ట‌ర్ కూల్‌.. ఫుల్‌స్టాప్ పెట్టేశాడు..

హైద‌రాబాద్‌: మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ.. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.  టీమిండియాకు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌తో పాటు వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను అందించ‌న మాజీ సార‌థి అక‌స్మాత్తుగా త‌న రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.  ధోనీ రిటైర్మెంట్‌పై కొన్నాళ్లుగా చ‌ర్చ సాగుతోంది. ఇక ధోనీ ఆడ‌డు అని ఇటీవ‌లే గంభీర ఓ క్లారిటీ ఇచ్చారు. కానీ ఇవాళ కాసేప‌టి క్రితం త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్లు చెప్పాడు.  ఇన్నాళ్లూ మీరు చూపిన ప్రేమ, మ‌ద్ద‌తుకు ధ‌న్యావాదాలు అంటూ తెలుపుతూనే.. రాత్రి 7 గంట‌ల 29 నిమిషాల నుంచి రిటైర్ అయిన‌ట్లుగా భావించాల‌ని త‌న కామెంట్‌లో పోస్టు చేశాడు. త‌న రిటైర్మెంట్‌ను ధోనీ త‌నదైన స్ట‌యిల్‌లోనే చెప్పాడు.

మిస్ట‌ర్ కూలీ కెరీర్ ఓ టార్జ‌న్‌లా స్టార్ట్ అయ్యింది. జుంపాల జ‌ట్టుతో వెరైటీగా క‌నిపించిన ధోనీ.. త‌న ఆట‌తీరుతో అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాడు. అత్యంత స్వ‌ల్ప స‌మ‌యంలోనే మేటి క్రికెట‌ర్‌గా రాణించాడు. కీపింగ్ బాధ్య‌త‌ల‌తో పాటు జ‌ట్టు సార‌ధిగా కూడా అనిత‌ర‌మైన సేవ‌లు అందించాడు.  మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఉన్న క్రేజ్‌ను.. ధోనీ త‌న వైపు తిప్పుకున్నాడు. హెలికాప్ట‌ర్ షాట్‌తోనూ తొటి క్రికెట‌ర్ల‌ను ముగ్దుల్ని చేశాడు.  క్రికెట్ శారీక‌మైన క్రీడే అయినా.. మాన‌సికంగా ఎలా ఆ ఆటను ఆడాలో ధోనీ త‌న స్ట‌యిల్‌లో చూపించాడు.  జార్ఖండ్ డైన‌మైట్ అన్న నిక్‌నేమ్‌ను అత‌ను సొంతం చేసుకున్నాడు.  ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు త‌న మైండ్‌గేమ్‌తో ఉక్కిరిబిక్కిరి చేశాడు.  చాలా ఉత్కంఠ‌భ‌రిత‌మైన ఇన్నింగ్స్ ఆడ‌డంలోనూ ధోనీ దిట్ట‌.  ఎన్నో మ్యాచ్‌ల‌కు అత‌ను చాలా థ్రిల్లింగ్ ఫినిష్ ఇచ్చాడు.  ఫైన‌ల్ ఓవ‌ర్‌లో ధోనీ ఉంటే, మ్యాచ్ గెల‌వ‌చ్చు అన్న ఐడెంటీ క్రియేట్ చేశాడు. 

వాస్త‌వానికి రెండు రోజుల క్రితం అత‌ను క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాడు.  యూఏఈలో జ‌ర‌గ‌నున్న టీ20 టోర్నీకి సిద్ధం అవుతున్నాడు. ఆ ప‌రీక్ష‌లో ధోనీ నెగ‌టివ్‌గా తేలాడు. క‌రోనా వ‌ల్ల ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జ‌ర‌గాల్సిన టీ20 టోర్నీ ర‌ద్దు అయ్యింది. అయితే చెన్నై జ‌ట్టుతో చేరిన 39 ఏళ్ల ధోనీ.. మ‌ర‌స‌టి రోజే రిటైర్మెంట్ ప్ర‌క‌టించడం ఆశ్చ‌ర్యం.  ఇండియా క్రికెట‌ర్ల‌లో టాప్ ప్లేయ‌ర్‌గా ధోనీ త‌న స‌త్తాను చాటాడు. ధోనీ మొత్తం 350 వ‌న్డేలు, 90 టెస్టులు, 98 టీ20లు ఆడాడు. వ‌న్డేల్లో అత‌ను 10,773 ర‌న్స్ చేశాడు. వ‌న్డేల్లో అత‌ని స‌గ‌టు 50పైనే ఉన్న‌ది. త‌న కెరీర్‌లో ధోనీ వ‌న్డేల్లో ఎక్కువ శాతం నెంబ‌ర్ 5 లేదా 7వ స్థానంలో ఆడాడు. 

టెస్టుల్లోనూ ధోనీ కెరీర్ సూప‌ర్‌గా ఉంది. అత‌ను టెస్టుల్లో 4876 ర‌న్స్ చేశాడు.  స‌గ‌టు 38.09గా ఉంది.  అత‌ను ఆడిన టెస్టుల్లో 27 మ్యాచ్‌ల‌ను విజ‌య‌ప‌థంలో న‌డిపంచాడు. భార‌త సార‌థిగా ఆ ఘ‌న‌త‌ను సాధించిన తొలి క్రికెట‌ర్ ధోనీయే. 98 టీ20ల్లో 1617 ర‌న్స్ చేశాడ‌త‌ను. ఆ ఇన్నింగ్స్‌లో 37.60 యావ‌రేజ్ ఉన్న‌ది. వాస్త‌వానికి ధోనీ కెరీర్‌లో ర‌న్స్ కీల‌కం కాదు. అత‌ను జ‌ట్టును న‌డిపించిన తీరు కీల‌క‌మైంది.  మాస్ట‌ర్ స్ట్రాట‌జిస్ట్‌గా ధోనీకి గుర్తింపు ఉన్న‌ది.  త‌న కెప్టెన్సీతో అంద‌ర్నీ స్ట‌న్ చేసేశాడు. మ్యాచ్ ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసి.. అద్భుత‌మైన ఎత్తుగ‌డ‌లు వేసేవాడు.  ఇక స్టంప్స్ వెనుక ఉన్న ధోనీ.. క‌ను రెప్ప‌పాటులోనే స్టంపింగ్‌ చేసేవాడు. ధోనీ చేసిన స్టంపింగ్‌ కానీ ర‌నౌట్స్ కానీ.. క్రికెట్ చ‌రిత్ర‌లో చాలా ప్ర‌త్యేకంగా నిలిచిపోతాయి. అనేక మంది స్పిన్ బౌల‌ర్ల‌ల‌కు ప్రాణం పోసింది ధోనీ స్టంపింగ్‌ అన్నా ఆశ్చ‌ర్యం లేదు. 

2007లో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. 2011లో వ‌న్డే వ‌రల్డ్‌క‌ప్‌ను భార‌త్‌కు అందించిన సార‌ధి ధోనీయే.  రెండుసార్లు వ‌ర‌ల్డ్‌క‌ప్ ట్రోఫీని అందుకున్న భార‌తీయ క్రికెట‌ర్ ధోనీయే.  ఇక ఐపీఎల్‌లో చెన్నై జ‌ట్టుకు కూడా కెప్టెన్‌గా మూడు ట్రోఫీల‌ను అందించాడు.15 ఏళ్లుగా త‌న క్రికెటింగ్ స్కిల్స్‌తో ఆక‌ట్టుకున్న ధోనీని ఇక అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించాడు. అద్భుత‌మైన వ్యూహ‌క‌ర్త‌ను టీమిండియా మిస్స‌వుతున్న‌ది. అసాధార‌ణ‌మైన ఆట‌శైలితో క్రికెట్ ప్రేమికుల్ని ఆక‌ట్టుకున్న థోనీకి న‌మ‌స్తే తెలంగాణ థ్యాంక్స్ చెబుతోంది.logo