ఆదివారం 05 జూలై 2020
Sports - Apr 13, 2020 , 20:13:29

ధోనీ ఆఖ‌రాట ఆడేశాడు: ఆకాశ్ చోప్రా

ధోనీ ఆఖ‌రాట ఆడేశాడు: ఆకాశ్ చోప్రా

ధోనీ ఆఖ‌రాట ఆడేశాడు: ఆకాశ్ చోప్రా 

న్యూఢిల్లీ:  భార‌త్ సీనియ‌ర్ క్రికెట‌ర్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ పున‌న‌రాగ‌మ‌నంపై చ‌ర్చ కొన‌సాగుతూనే ఉన్నది. మ‌హీ తిరిగి జ‌ట్టులోకి వ‌స్తాడా లేక వీడ్కోలు ప‌లుకుతాడా అన్న దానిపై మాజీ క్రికెట‌ర్లు త‌మ‌దైన శైలిలో అభిప్రాయాలు చెబుతూనే ఉన్నారు. ఐపీఎల్ జ‌రుగ‌క‌పోతే ధోనీ రీఎంట్రీ ఇక క‌ష్ట‌మేన‌ని కొంద‌రంటే..మ‌రికొంద‌రు అత‌ని ఫిట్‌నెస్ అమోఘం మ‌రో రెండేండ్లు ఈజీగా ఆడుతాడ‌ని అంటున్నారు. 


అయితే టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ ఆకాశ్‌చోప్రా ..మాత్రం ధోనీ ఇప్ప‌టికే భార‌త్ త‌ర‌ఫున ఆఖ‌రి మ్యాచ్ ఆడేశాడ‌ని అన్నాడు. ఇక తిరిగి జ‌ట్టులోకి రావ‌డం ఇక క‌ష్ట‌మే అంటూ సోమ‌వారం వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ క్రికెట‌ర్ ర‌మీజ్ రాజాతో జ‌రిగిన యూట్యూబ్‌చ‌ర్య కార్య‌క్ర‌మంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ‘ ధోనీ పున‌రాగ‌మ‌నంపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రితో చ‌ర్చించి ఉండ‌క‌పోవ‌చ్చు నాకు తెలిసి. అత‌ను అంత తొంద‌ర‌గా బ‌య‌ట‌కు చెప్పే వ్య‌క్తి  కాదు. ఐపీఎల్‌లో బాగా ఆడితే..టీమ్ఇండియాలో ధోనీ రాక సులువే అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నా వ‌ర‌కైతే..అత‌ను జాతీయ జట్టు త‌ర‌ఫున చివ‌రి మ్యాచ్ ఆడినట్లు అనిపిస్తున్న‌ది. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో న్యూజిలాండ్‌తో ఆఖ‌రి మ్యాచ్ త‌ర్వాత నుంచి అత‌ను జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. అత‌న్ని ఎవ‌రూ తీసివేసింది కూడా లేదు. ఇక ఎక్కువ కాలం భార‌త్‌కు ఆడే అవ‌కావం లేద‌న్న‌ట్లు మ‌హీ మాన‌సికంగా సిద్ధ‌మైన‌ట్లు కనిపిస్తున్న‌ది. ఒక‌వేళ రానున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ధోనీ అవ‌స‌రం త‌ప్ప‌నిస‌రి అనుకుని గంగూలీ, ర‌విశాస్త్రి , విరాట్ కోహ్లీ ర‌మ్మంటే అప్పుడు ఏమ‌న్నా ఆలోచించవ‌చ్చు. అంత‌కుమించి మ‌రొక‌టి ఉండ‌దు. వీడ్కోలు ఘ‌నంగా తీసుకువాల‌న్న ఉద్ధేశం ధోనీది కాదు’ అని చోప్రా అన్నాడు. 


logo