లోకనాయకుడు

- దశాబ్దపు వన్డే, టీ20 అత్యుత్తమ కెప్టెన్‌గా ధోనీ
- టెస్టు జట్టుకు నాయకుడిగా కోహ్లీ
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన ఈ దశాబ్దపు అత్యుత్తమ జట్లలో భారత ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. ఈ ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఐసీసీ వన్డే, టీ20 జట్లకు సారథిగా ఎంపిక కాగా, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు టీమ్‌కు కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. ఈ పదేండ్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో కూడిన మూడు ఫార్మాట్ల ‘డెకేడ్ ఆఫ్ ది ఇయర్'జట్లను ఐసీసీ ఆదివారం ప్రకటించింది. వన్డే జట్టులో భారత తరఫున ముగ్గురికి, టీ20ల్లో నలుగురికి చోటు దక్కింది. మూడు జట్లలో స్థానం సంపాదించిన ఏకైక ఆటగాడి విరాట్ కోహ్లీ నిలిచాడు.మహిళల దశాబ్దపు జట్లలో వన్డే టీమ్‌లో భారత్ నుంచి మిథాలీ రాజ్, జులన్ గోస్వామి ఉన్నారు. టీ20 జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్, పూనమ్‌కు స్థానం దక్కింది.
టీ20 జట్టు : రోహిత్, గేల్, ఫించ్, కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్, ధోనీ(కెప్టెన్), పొలార్డ్, రషీద్, బుమ్రా, మలింగ
వన్డే జట్టు: రోహిత్, వార్నర్, కోహ్లీ, డివిలియర్స్, షకీబ్, ధోనీ (కెప్టెన్), స్టోక్స్, స్టార్క్, బౌల్ట్, తాహిర్, మలింగ
టెస్టు జట్టు: కుక్, వార్నర్, విలియమ్సన్, కోహ్లీ (కెప్టెన్), స్మిత్, సంగక్కర, స్టోక్స్, అశ్విన్, స్టెయిన్, బ్రాడ్, అండర్సన్.
తాజావార్తలు
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి.. కంగనా విషెస్
- నేడు ఐసెట్ మూడో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
- కుటుంబ కలహాలతో.. భార్య, కుమార్తెను చంపిన భర్త
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్
- బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త
- నేపాల్, బంగ్లాకు 30 లక్షల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్
- కల్తీ కల్లు ఘటన.. మత్తు పదార్థాలు గుర్తింపు
- స్వాతిలో ముత్యమంత సాంగ్‌ని రీమిక్స్ చేసిన అల్లరోడు-వీడియో
- ఫస్టియర్ ఫెయిలైన వారికి పాస్ మార్కులు!
- సింగరేణిలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు