సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 25, 2020 , 15:01:22

నా లాంటి వాళ్లకు ధోని ఒక హీరో : కేఎల్‌ రాహుల్‌

నా లాంటి వాళ్లకు ధోని ఒక హీరో : కేఎల్‌ రాహుల్‌

ఎంఎస్ ధోని ఒక తరానికి చెందిన క్రికెటర్. ఈ విషయం ధోనితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్న వారందరికీ తెలుసు. ఇప్పుడు ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.  ధోని సహచరులు చాలా మంది అతడితో పాటు ఆడిన అనుభవాన్ని పంచుకుంటున్నారు. 

తాజాగా టీమిండియా బ్యాట్స్‌మెన్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన తనలాంటి వారికి ధోని ఒక హీరో అని అన్నాడు. ఐపీఎల్‌ విడుదల చేసిన వీడియోలో రాహుల్ మాట్లాడుతూ ‘ఇది చాలా భావోద్వేగ క్షణం. మేమంతా ఎంఎస్ ధోనిలా కావాలని కోరుకుంటూ పెరిగాం. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన నా లాంటి వ్యక్తికి ప్రత్యేకంగా అతను ఒక హీరో.  మీరు ఎక్కడి నుంచి వచ్చారో పట్టింపు లేదు.. మీరు ఎప్పుడైనా వెళ్లి మీ కలలను సాధించవచ్చు.. అనడానికి ధోని ప్రత్యక్ష సాక్ష్యమ’ని రాహుల్‌ అన్నాడు. ‘ధోని గురించి చెప్పడానికి తగినన్ని పదాలు నా దగ్గర లేవు. నేను అతడిని కౌగిలించుకొని కృతజ్ఞతలు చెబుతాను.’ అని రాహుల్‌ చెప్పుకొచ్చాడు. 

కేఎల్‌ రాహుల్ 2014 డిసెంబర్‌లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. యాధృచ్ఛికంగా అదే ధోని చివరి మ్యాచ్‌. ఆ మ్యాచ్ తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తరువాత రాహుల్‌.. ధోని కెప్టెన్సీలోనే వన్డేలు, టీ20 ఫార్మాట్లలో అడుగుపెట్టాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo