హైదరాబాద్: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni) .. ఇప్పుడు కొత్త హెయిర్ స్టయిల్ ( Hari style ) తో ఫ్యాన్స్‌కు కిక్కెక్కిస్తున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే అతని ఫోటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నది. ధోనీ హెయిర్స్టయిలిస్టు ఆలిమ్ హక్కిమ్ ఆ ఫోటోను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. వెరైటీ కటింగ్, గడ్డంతో ధోనీ సూపర్ లుక్‌తో అదరగొడుతున్నాడు. ధోనీ డాషింగ్ లుక్‌పై సోషల్ మీడియాలో లైక్‌లు కుప్పల్లా వచ్చిపడుతున్నాయి. లైట్‌గా గడ్డం.. ఫంకీ హెయిర్‌స్టయిల్‌తో ధోనీ దిగిన ఫోటో ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఆ ఫోటోకు ఓ ఎమోజీతో కామెంట్ చేశాడు. ఇక అభిమాని అయితే.. ధోనీ 25 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నట్లు కామెంట్ పెట్టాడు. ఐపీఎల్లో చెన్నై టీమ్‌తో ఆడుతున్న ధోనీ.. గత ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.