ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Aug 22, 2020 , 14:24:45

'ధోనీ బ్యాటింగ్‌లో ఏమాత్రం పస తగ్గలేదు..భారీ సిక్సర్లు కొట్టాడు'

'ధోనీ బ్యాటింగ్‌లో ఏమాత్రం పస తగ్గలేదు..భారీ సిక్సర్లు కొట్టాడు'

 దుబాయ్‌: ఏడాదికిపైగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న  మహేంద్ర సింగ్‌ ధోనీలో ఏమాత్రం జోరు తగ్గలేదని అంటున్నారు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీఈవో కేఎస్‌ విశ్వనాథన్‌. త్వరలో ఐపీఎల్‌ 2020 ఆరంభంకానున్న నేపథ్యంలో   ధోనీ ఫామ్‌పై ఎలాంటి సందేహాలు అవసరం లేదని విశ్వనాథన్‌ చెబుతున్నారు.  ఐపీఎల్‌ జరిగే యూఏఈకి వెళ్లేముందు ధోనీతో సహా చెన్నై ఆటగాళ్లు ఎంఏ చిదంబరం స్టేడియంలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. 

'ధోనీ బ్యాటింగ్‌ బాగా చేస్తున్నాడు. మైదానం నలువైపులా భారీగా సిక్సర్లు బాదాడు. ధోనీ మునుపటిలా  ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసం, సంతోషంగా ఉన్నాడని' విశ్వనాథన్‌ చెప్పారు.   ధోనీ రిటైర్మెంట్‌పై టీమ్‌ ఆశ్చర్యానికి గురైందని ఆయన పేర్కొన్నారు. 

'చాలా కాలం నుంచి ఆటగాళ్లు ట్రైనింగ్‌కు దూరంగా  ఉన్నారు. ఒక విధంగా ఇది వారికి మంచిదే.  సుదీర్ఘ విరామం తర్వాత వాళ్లు ఎక్కువ సాధన చేయలేదు. దాంతో ఆటగాళ్లు గాయపడే ప్రమాదం ఉన్నది. త్వరలోనే క్రికెటర్లు లయను అందుకుంటారని' చెన్నై శిక్షణా శిబిరం గురించి విశ్వనాథన్‌ చెప్పారు.

'మహీ గతేడాది   ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్ ఆడాడు. ఐనా  అతడు  గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాడు, ఎలాంటి ఆందోళన అవసరం లేదని' విశ్వనాథన్‌ ధీమా వ్యక్తం చేశారు.


logo