ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Sep 11, 2020 , 02:40:45

వాయుసేన మరింత బలోపేతం

వాయుసేన మరింత బలోపేతం

  • రాఫెల్‌ యుద్ధ విమానాల రాకపై ధోనీ హర్షం 

న్యూఢిల్లీ: అత్యంత శక్తిమంతమైన రాఫెల్‌ యుద్ధ విమానాలు చేరడంతో భారత వాయుసేన (ఐఏఎఫ్‌) మరింత బలోపేతమైందని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, టెరిటోరియల్‌ ఆర్మీ లెఫ్టినెంట్‌ కర్నల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అన్నాడు. మిరాజ్‌ 2000 రికార్డులను రాఫెల్‌ అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత వైమానిక దళంలోకి రాఫెల్‌ యుద్ధ విమానాలు వచ్చిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ధోనీ బుధవారం ట్వీట్లు చేశాడు. ‘అత్యుత్తమంగా నిరూపించుకున్న 4.5 తరం యుద్ధ విమానాలు.. ప్రపంచ అత్యుత్తమ పైలట్ల దగ్గరికి వచ్చాయి. మన పైలట్ల చేతుల్లో విభిన్న యుద్ధ విమానాలు ఉండడంతో భారత వాయుసేన సామర్థ్యం, శక్తి మరింత పెరిగింది’ అని అందులో పేర్కొన్నాడు.  


logo