శనివారం 30 మే 2020
Sports - Mar 29, 2020 , 20:39:10

ధోనీ 30 ల‌క్ష‌లు చాల‌నుకున్నాడు: జాఫ‌ర్

ధోనీ 30 ల‌క్ష‌లు చాల‌నుకున్నాడు:  జాఫ‌ర్

ధోనీ 30 ల‌క్ష‌లు చాల‌నుకున్నాడు: వ‌సీం జాఫ‌ర్ 

ముంబై: ధోనీ త‌న జీవితాన్ని రూ.30 ల‌క్ష‌ల‌తో ప్ర‌శాంతంగా గ‌డిపేద్దామ‌నుకున్నాడ‌ట. అవును విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా..ఇది నిజం. భార‌త జట్టుకు ఆడిన తొలినాళ్లలో మ‌హీ మ‌దిలో మెదిలిన ఆలోచ‌న అట ఇది. దేశ క్రికెట్‌కు ఎన్నో చిర‌స్మ‌రణీయ విజ‌యాలందించిన ధోనీ..ప‌లు ప్ర‌ముఖ కంపెనీల ఎండార్స్‌మెంట్ల‌తో కోట్లు ఆర్జించాడు. ప్ర‌పంచ క్రికెట్‌లో త‌న‌కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్ప‌రుచుకున్న మ‌హీతో త‌న‌కున్నఅనుబంధాన్ని టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ వ‌సీం జాఫ‌ర్ గుర్తుకు తెచ్చుకున్నాడు.  సోష‌ల్‌మీడియా ట్విట్ట‌ర్లో ఒక అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు జాఫ‌ర్ ఇలా స‌మాధాన‌మిచ్చాడు. ‘కెరీర్ తొలినాళ్ల‌లో భార‌త జ‌ట్టులోకి వచ్చిన ఏడాది, రెండేండ్ల‌లో అనుకుంటా..నాకు బాగా గుర్తు ధోనీ  జీవితాంతం ప్ర‌శాంతంగా బ్ర‌త‌కడానికి రూ.30 ల‌క్ష‌లు సరిపోతాయ‌న్నాడు’ అని ఈ ముంబైక‌ర్ చెప్పుకొచ్చాడు . గ‌తేడాది ఇంగ్లండ్‌లో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత నుంచి మ‌హీ  జాతీయ జట్టుకు దూర‌మ‌య్యాడు. ఐపీఎల్‌లో స‌త్తాచాటైనా తిరిగి జ‌ట్టులోకి వ‌ద్దామ‌నుకుంటే క‌రోనా వైర‌స్ కార‌ణంగా వ‌చ్చే నెల 15 వ‌ర‌కు వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో అస‌లు ఐపీఎల్ జ‌రుగుతుందా లేదా అన్న‌ది అనుమానంగా మార‌డంతో ధోనీ రీఎంట్రీపై ఒకింత సందిగ్ధ‌త ఏర్ప‌డింది.                                        
logo