బెంగళూరు : చేప కడుపులో ప్లాస్టిక్ బ్యాగ్ లభ్యమైంది. ఆ ప్లాస్టిక్ బ్యాగు మిల్లీ గ్రాముల్లో లేదు.. ఏకంగా 10 కిలోల బరువు ఉంది. దీంతో చేపలను శుభ్రపరిచే వ్యక్తి షాక్‌కు గురయ్యాడు.
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఓ వ్యక్తి సోమవారం చేపలను శుభ్రం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ చేప కడుపును కోయగా.. అందులో నుంచి 10 కిలోల ప్లాస్టిక్ బ్యాగ్ బయటపడింది. దీంతో ఆయన షాక్‌కు గురై వీడియో తీశాడు. సముద్రపు ఒడ్డుకు వెళ్లే వారు ప్లాస్టిక్ వస్తువులను, కవర్లను ఆ నీటిలో పడేయడంతో.. వాటిని చేపలు తింటున్నాయి. అలా చేపల కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి.
ప్లాస్టిక్‌ను సముద్రంలో పడేయడం వల్ల కలిగే అనర్థాలేమిటో ఈ చేపను చూస్తే అర్థమవుతుందని ఆయన పేర్కొన్నాడు. చేపలు పట్టేందుకు వెళ్తున్న జాలర్ల వలలోకి 40 నుంచి 50 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే వస్తున్నాయని తెలిపాడు. ఇప్పటికైనా ప్రజలు బాధ్యతతో మెలగాలని, పర్యావరణానికి హాని కలిగించొద్దని కోరాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి