గురువారం 09 జూలై 2020
Sports - Apr 17, 2020 , 19:55:02

ధోనీకి కోపం వచ్చిన వేళ‌..

ధోనీకి కోపం వచ్చిన వేళ‌..

ధోనీకి కోపం వచ్చిన వేళ‌..

న్యూఢిల్లీ: మ‌హేంద్ర‌సింగ్ ధోనీ..మిన్ను విరిగి మీద ప‌డ్డా తొణ‌క‌ని వ్య‌క్తిత్వం. బ్ర‌హ్మండం బ‌ద్ద‌లైనా..త‌న ప‌ని తాను ప‌నిచేసుకుంటూ పోయే వ్య‌క్తి.  న‌రాలు తెగే ఉత్కంఠభ‌రిత మ్యాచ్‌ల్లోనూ భావోద్వేగాల‌ను అణుచుకుపోవ‌డం ధోనీకే చెల్లింది. అరంగేట్రం నుంచి నిన్న‌టి మొన్న‌టి దాకా మైదానంలో ఏనాడూ ఈ జార్ఖండ్ డైన‌మైట్ హ‌ద్దుమీరి ప్ర‌వ‌ర్తించింది లేదు. 

కానీ ఒకానొక సంద‌ర్భంలో త‌న‌పై మ‌హీ భాయ్ త‌ట్టుకోలేని కోపాన్ని ప్ర‌ద‌ర్శించాడ‌ని టీమ్ఇండియా చైనామ‌న్ బౌల‌ర్ కుల్దీప్ యాద‌వ్ చెప్పుకొచ్చాడు. శుక్ర‌వారం ఓ ఇన్‌స్టాగ్రామ్‌లో జ‌రిగిన చాట్‌లో కుల్దీప్ ఈ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకున్నాడు. ‘స‌రిగ్గా మూడేండ్ల క్రితం శ్రీ‌లంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో నాపై ధోనీ ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించాడు. అప్ప‌డు బ్యాటింగ్‌ చేస్తున్న కుశాల్ పెరెర‌..నా బౌలింగ్‌లో బౌండ‌రీ బాదాడు. వెంట‌నే వికెట్ల వెనుక నుంచి మ‌హీ భాయ్ ఫీల్డింగ్ మార్చుకో అంటూ సూచించాడు. కానీ ఆ మాట‌ను పెడ‌చెవిన పెట్టాను. ఆ మ‌రుసటి బంతిని కూడా కుశాల్ రివ‌ర్స్ స్వీప్‌తో ఫోర్ కొట్టాడు. కోపం ఆపుకోలేక వెంట‌నే నా ద‌గ్గ‌ర‌కొచ్చిన ధోనీ..తానేమ‌న్న పిచ్చోడినా..300 వ‌న్డేలాడాను..తాను చెప్పిన‌ట్లు ఎందుకు విన‌డం లేదు నువ్వు అంటూ ప్ర‌శ్నించాడు ’ అని కుల్దీప్ గుర్తుకు తెచ్చుకున్నాడు. అయితే మ్యాచ్ ముగిసిన త‌ర్వాత టీమ్ బ‌స్సులో వెళ్లేట‌ప్పుడు..తాను చేసింది త‌ప్పే అంటూ ధోనీకి క్ష‌మాప‌ణ‌లు చెప్పాన‌ని కుల్దీప్ పేర్కొన్నాడు. అప్పుడు ధోనీ స్పందిస్తూ గ‌త 20 ఏండ్ల‌లో ఎప్పుడూ  ఇలా కోపానికి రాలేద‌ని కుల్దీప్‌కు చెప్పాడ‌ట‌. logo