సోమవారం 13 జూలై 2020
Sports - Apr 22, 2020 , 23:52:33

కుమారుడితో ధవన్ ఇండోర్ క్రికెట్​

కుమారుడితో ధవన్ ఇండోర్ క్రికెట్​

న్యూఢిల్లీ: కరోనా వైరస్​ కారణంగా క్రికెట్​ పోటీలు నిలిచిపోవడంతో టీమ్​ఇండియా క్రికెటర్లు ఇండ్లలోనే ఉంటూ కుటుంబాలతో సమయాన్ని సంతోషంగా గడుపుతున్నారు. భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధవన్ అయితే మరింతగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన కుమారుడు జొరావర్​తో శిఖర్​ ఇండోర్ క్రికెట్ ఆడాడు. ఆ వీడియోకు కామెంటరీతో పాటు ప్రేక్షకుల ఆరుపులను జత చేసి ఇన్​స్టాగ్రామ్​లో బుధవారం పోస్ట్ చేశాడు. జొరావర్ బౌలింగ్​ చేయగా శిఖర్ బ్యాట్​తో అదరగొట్టాడు. సీరియస్​గా సాగిన మ్యాచ్​లో తండ్రీకొడుకులు ఓ దశలో సరదాగా స్లెడ్జ్ చేసుకున్నారు. ఈ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేసిన శిఖర్​ “క్వారంటైన్ ప్రీమియర్ లీగ్​లో అన్నింటికన్నా ఉత్కంఠ క్షణాలు. ధవన్​ వర్సెస్ ధవన్​” అని క్యాప్షన్ జత చేశాడు. కుమారుడితో ఆడుకోవడంతో ధవన్ ఇంటి పనుల్లో సైతం పాలుపంచుకుంటున్నాడు.


logo