శుక్రవారం 05 మార్చి 2021
Sports - Jan 24, 2021 , 20:44:14

పక్షులకు గింజలు వేసిన ధావన్‌..విచారణకు డీఎం ఆదేశం

పక్షులకు గింజలు వేసిన ధావన్‌..విచారణకు డీఎం ఆదేశం

వారణాసి: నిబంధనలు ఉల్లంఘించి పక్షులకు ఆహారం వేసిన టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ వివాదంలో చిక్కుకున్నాడు.  మార్గదర్శకాలు పాటించకుండా, పడవలోకి పర్యాటకులను అనుమతించిన బోటు యజమానిపై చర్యలు తీసుకుంటామని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్(డీఎం)‌ కౌశల్‌‌ రాజ్‌ శర్మ తెలిపారు. బర్డ్‌ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో ధావన్‌ పడవలో విహరిస్తూ పక్షులకు ఆహారం  వేయడం వివాదాస్పదమైంది. దీంతో మేజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించారు.   

పక్షులకు ఆహారం వేయడం ఆనందంగా ఉందని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ట్వీట్‌ చేసిన ధావన్‌ దీనికి సంబంధించిన ఫొటోను కూడా షేర్‌ చేయడంతో సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దేశంలోని 10 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాపించిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. 

VIDEOS

logo