శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 08, 2020 , 23:41:28

ధవన్‌, హార్దిక్‌, భువీ రీఎంట్రీ

ధవన్‌, హార్దిక్‌, భువీ రీఎంట్రీ

అహ్మదాబాద్‌: గాయాల నుంచి కోలుకున్న ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌.. భారత జట్టులోకి మళ్లీ వచ్చేశారు. ఈనెల 12వ తేదీ నుంచి దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగనున్న మూడు వన్డేల సిరీస్‌కు వీరు ఎంపికయ్యారు. కొత్త చైర్మన్‌ సునీల్‌ జోషి నేతృత్వంలో ఆదివారం ఇక్కడ సమావేశమైన సెలెక్షన్‌ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కేదార్‌ జాదవ్‌ స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌ జట్టులోకి రాగా రోహిత్‌ శర్మకు విశ్రాంతి నిచ్చారు.
logo