మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Sep 09, 2020 , 03:19:31

జిల్లాల్లోనూ క్రికెట్‌ అభివృద్ధి చేయండి

జిల్లాల్లోనూ క్రికెట్‌ అభివృద్ధి చేయండి

  • హెచ్‌సీఏ చీఫ్‌ అజర్‌ను కోరిన సాట్స్‌ చైర్మన్‌ 

  హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: జిల్లాల్లోనూ క్రికెట్‌ అభివృద్ధికి కృషి చేయాలని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌ను సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి కోరారు. మంగళవారం అజర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న సాట్స్‌ చైర్మన్‌ పలు విషయాలపై చర్చించారు. హెచ్‌సీఏలో జరుగుతున్న గొడవలకు ముగింపు పలుకాలన్నారు. అవినీతిని పారదోలి హెచ్‌సీఏను ప్రక్షాళన చేయాలన్నారు. హైదరాబాద్‌లోని క్లబ్‌ల తరహాలో జిల్లా క్రికెట్‌ సంఘాలకు కూడా గుర్తింపునివ్వాలని  సూచించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటగల క్రికెటర్లకు తెలంగాణలో కొదువలేదని, ప్రోత్సాహమిస్తే మెరికల్లాంటి యువకులు బయటికొస్తారని అన్నారు. 


logo