శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Oct 11, 2020 , 20:19:45

MIvDC: నిదానంగా ఆడుతున్న ఢిల్లీ

MIvDC: నిదానంగా ఆడుతున్న ఢిల్లీ

అబుదాబి: ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తోన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ నిదానంగా ఆడుతోంది. తడబడిన ఢిల్లీ   24 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకున్నది.  ముంబై బౌలర్ల కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి బ్యాటింగ్‌ చేస్తున్నారు. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన  ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ మూడో బంతికే పృథ్వీ షా(4) పెవిలియన్‌ చేరాడు.

ఆ తర్వాత స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్య వేసిన ఐదో ఓవర్లో వన్‌డౌన్‌లో వచ్చిన రహానె(15) ఎల్బీడబ్లూగా పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(28), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(18)  క్రీజులో ఉన్నారు.  9 ఓవర్లకు ఢిల్లీ 2 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది.