శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Nov 02, 2020 , 21:16:44

పడిక్కల్‌ ఒంటరి పోరాటం

పడిక్కల్‌ ఒంటరి పోరాటం

అబుదాబి:  ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో  మొదట బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సాధారణ స్కోరుకే పరిమితమైంది.  దేవదత్‌ పడిక్కల్‌(50: 41 బంతుల్లో 5ఫోర్లు)  ఒక్కడే రాణించడంతో  20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. కీలక మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(29), ఏబీ డివిలియర్స్‌(35) భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు.

ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జే(3/33), రబాడ(2/30) బెంగళూరును భారీ దెబ్బకొట్టారు.  ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. భాగస్వామ్యాలు నెలకొల్పకుండా వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. పడిక్కల్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేయడంతో కోహ్లీసేన ఆమాత్రం స్కోరు చేసింది.

అశ్విన్‌ బౌలింగ్‌లో కోహ్లీ ఔటవడంతో ఢిల్లీ మ్యాచ్‌పై పట్టుసాధించింది.  విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ డివిలియర్స్‌ రనౌటవడంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది.  ఓపెనర్‌ జోష్‌ ఫిలిప్‌(12), క్రిస్‌ మోరీస్‌(0), శివమ్‌ దూబే(17) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.