గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 13, 2020 , 13:00:09

ఐపీఎల్‌ని బ్యాన్ చేసిన ఢిల్లీ ప్ర‌భుత్వం

ఐపీఎల్‌ని బ్యాన్ చేసిన ఢిల్లీ ప్ర‌భుత్వం

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక చర్యలను తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ విష‌యంలో ప‌లు చ‌ర్చ‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఐపీఎల్‌ని బ్యాన్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టిస్తున్నాయి. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఐపీఎల్‌ని బ్యాన్ చేయ‌డంతో పాటు టిక్కెట్ల అమ్మకాన్ని నిషేదించింది. తాజాగా ఢిల్లీ ప్ర‌భుత్వం కూడా ఐపీఎల్‌ని బ్యాన్ చేస్తున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. స్పోర్ట్స్‌,  మీటింగ్స్‌, కాన్ఫ‌రెన్స్ కార్య‌క్ర‌మాల‌న్నింటిన ర‌ద్దు చేస్తున్న‌ట్టు హెల్త్ సెక్ర‌ట‌రీ ప‌ద్మిని సింగ్లా తెలిపారు. ఢిల్లీలో తాజాగా మ‌రో పాజిటివ్ కేసు న‌మోదైంది. ఇటీవ‌ల ఫ్రాన్స్‌, చైనాకి వెళ్ళొచ్చిన వ్య‌క్తి టెస్ట్ చేయ‌గా పాజిటివ్ అని తేలింది. దీంతో ఢిల్లీలో 6 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, భార‌త్‌లో 76 కేసులు న‌మోదైన‌ట్టు తెలుస్తుంది.  ఎవ‌రు గుంపులు గుంపులు గా ఏర్పడకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి. logo
>>>>>>