మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Nov 10, 2020 , 19:03:32

ఐపీఎల్‌ ఫైనల్‌: బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

ఐపీఎల్‌ ఫైనల్‌:  బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

దుబాయ్‌: ఐపీఎల్ పదమూడో సీజన్‌  ముగింపు దశకు చేరుకుంది.  మంగళవారం రాత్రి జరిగే  తుదిపోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌,  ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనున్నాయి.  టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై సత్తాచాటిన జట్టునే కొనసాగిస్తున్నట్లు శ్రేయస్‌ చెప్పాడు. స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ స్థానంలో జయంత్‌ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు ముంబై సారథి రోహిత్‌ శర్మ తెలిపాడు. 

నాలుగు సార్లు  టైటిల్‌ ముద్దాడిన  ముంబై.. ఎట్టకేలకు పదమూడో సీజన్‌లో  ఫైనల్‌ చేరి తొలి ఐపీఎల్‌ టైటిల్‌పై కన్నేసిన ఢిల్లీ రసవత్తర పోరుకు సన్నద్ధమయ్యాయి.    లీగ్‌ దశలో ఢిల్లీపై రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ముంబై   తొలి క్వాలిఫయర్‌లోనూ చిత్తుగా ఓడించింది.