ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా గెలుపు లక్ష్యంగా ముందుకెళుతున్నది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢిల్లీ చిత్తుచేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హైదరాబాద్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన క్యాపిటల్స్..శ్రేయాస్ అయ్యర్, ధవన్, పంత్ బ్యాటింగ్‌తో ఘన విజయాన్నందుకుని టాప్‌లో నిలిచింది. ఢిల్లీకి పూర్తి భిన్నంగా హైదరాబాద్ మరో ఓటమితో కంగుతిన్నది. క్యాపిటల్స్‌కు ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయిన రైజర్స్ ఏడో విజయంతో ఆఖర్లో కొనసాగుతున్నది.
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ రేసులో టాప్ గేర్‌లో దూసుకెళుతున్నది. గత సీజన్‌ను తలపిస్తూ ప్రత్యర్థులకు దీటైన సవాల్ విసురుతున్నది. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో(13 బంతులు మిగిలుండగానే) ఘన విజయాన్నందుకుంది. దీంతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకున్న క్యాపిటల్స్ ప్రస్తుతం టాప్‌లో కొనసాగుతున్నది. హైదరాబాద్ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలకు చేరింది. ఓపెనర్ పృథ్వీషా(11) నిరాశపరిచినా..అయ్యర్(47 నాటౌట్), ధవన్(42), పంత్(35 నాటౌట్) సమయోచిత ఇన్నింగ్స్‌తో రాణించారు. ఆది నుంచే హైదరాబాద్ బౌలర్లను లక్ష్యంగా చేసుకున్న ఢిల్లీ బ్యాట్స్‌మెన్ బౌండరీలతో చెలరేగారు. ముఖ్యంగా ధవన్, అయ్యర్ చూడచక్కని షాట్లతో అలరించారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 50 పరుగుల భాగసామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన కెప్టెన్ పంత్‌తో కలిసి అయ్యర్ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఖలీల్ అహ్మద్, రషీద్‌ఖాన్‌కు ఒక్కో వికెట్ దక్కింది. రెండు కీలక వికెట్లు తీసిన నోర్జెకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ శైలి మారలేదు. ఇన్నింగ్స్ మూడో బంతికే ఓపెనర్ వార్నర్(0).. నోర్జె బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అనూహ్యంగా దూసుకొచ్చిన బంతిని ఆడబోయిన వార్నర్..అక్షర్ పటేల్ క్యాచ్‌తో నిష్క్రమించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విలియమ్సన్..సాహాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరు అడపాదడపా బౌండరీలతో స్కోరుబోర్డుకు పరుగులు జోడించారు. గాడిలో పడిందనుకుంటున్న తరుణంలో రబాడ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన సహా(18) ధవన్ చేతికి చిక్కాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి హైదరాబాద్ రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది. ఓవైపు సహచరులు నిష్క్రమిస్తున్నా…మనీశ్‌పాండేతో కలిసి విలియమ్సన్ పరిణతి కనబరిచాడు. అనవసరపు షాట్లకు పోకుండా సింగిల్స్‌తో పాటు బౌండరీలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కేన్.. మూడోసారి బయటపడలేకపోయాడు. అక్షర్‌పటేల్ బౌలింగ్‌లో హెట్‌మైర్ క్యాచ్‌తో విలియమ్సన్(18) వెనుదిరిగడంతో మూడో వికెట్‌కు 31 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బంతి తేడాతో పాండే(17) కూడా ఔట్ కావడంతో రైజర్స్ కష్టాలు రెట్టింపయ్యాయి. ఆదుకుంటాడనుకున్న కేదార్ జాదవ్(3), హోల్డర్(10) నిరాశపర్చుగా అబ్దుల్ సమద్ (28), రషీద్‌ఖాన్(22) బ్యాట్లు ఝులిపించడంతో రైజర్స్ పోరాడే స్కోరు దక్కించుకుంది. సీనియర్లు విఫలమైన చోట ఈ ఇద్దరు ఢిల్లీ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని పరుగులు సాధించడంతో వంద పరుగుల మార్క్ దాటింది. ధాటిగా ఆడే ప్రయత్నంలో వికెట్లు కోల్పోయిన రైజర్స్ 134 పరుగులు చేసింది. రబాడ(3/37) మూడు వికెట్లతో రాణించగా, నోర్జె, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్: వార్నర్(సి)పటేల్(బి)నోర్జె 0, సాహా(సి)ధవన్(బి)రబాడ 18, విలియమ్సన్(సి)హెట్‌మైర్(బి)పటేల్ 18, మనీశ్‌పాండే(సి&బి)రబాడ 17, కేదార్ జాదవ్(ఎల్బీ)నోర్జె 3, సమద్(సి)పంత్(బి)రబాడ 28, హోల్డర్(సి)షా(బి)పటేల్ 10, రషీద్‌ఖాన్(రనౌట్) 22, భువనేశ్వర్ 5, సందీప్‌శర్మ రనౌట్ 0, ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 134/9; వికెట్ల పతనం: 1-0, 2-29, 3-60, 4-61, 5-74, 6-90, 7-115, 8-133, 9-134; బౌలింగ్: నోర్జె 4-0-12-2, అవేశ్‌ఖాన్ 4-0-27-0, అక్షర్‌పటేల్ 4-0-21-2, రబాడ 4-0-37-3, స్టోయినిస్ 1.1-0-8-0, అశ్విన్ 2.5-0-22-0.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీషా(సి)విలియమ్సన్(బి) అహ్మద్ 11, ధవన్(సి)సమద్(బి) రషీద్‌ఖాన్ 42, అయ్యర్ 47 నాటౌట్, పంత్ 35 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 17.5 ఓవర్లలో 139/2; వికెట్ల పతనం: 1-20, 2-72;బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4-0-33-1, భువనేశ్వర్ 3-0-21-0, హోల్డర్ 3.5-0-33-0, రషీద్‌ఖాన్ 4-0-26-1,సందీప్‌శర్మ 3-0-26-0.