బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 19, 2020 , 13:57:15

ఢిల్లీ క్యాపిటల్స్‌కు క్రిస్‌ వోక్స్‌ దూరం..జట్టులోకి నోర్జే

ఢిల్లీ క్యాపిటల్స్‌కు క్రిస్‌ వోక్స్‌ దూరం..జట్టులోకి నోర్జే

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ సౌతాఫ్రికా పేసర్‌ అన్రిచ్‌ నోర్జేను టీమ్‌లోకి తీసుకున్నది. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ ఈ ఏడాది లీగ్‌ నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో నోర్జేను ఎంపిక చేసినట్లు ఢిల్లీ పేర్కొంది. 26ఏండ్ల నోర్జేకు  ఇదే తొలి ఐపీఎల్‌ కాగా గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టులో ఉన్నప్పటికీ గాయం కారణంగా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు. ఢిల్లీ టీమ్‌లో భాగమయ్యేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు నోర్జే పేర్కొన్నారు.  

గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో ఢిల్లీ రూ.1.5 కోట్లకు వోక్స్‌ను దక్కించుకున్నది.    అంతర్జాతీయ క్రికెట్లో   వేసవిలో బిజీ షెడ్యూల్‌  కారణంగా  ఫ్రెష్‌గా ఉండేందుకు ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని వోక్స్‌ నిర్ణయించుకున్నాడు. 


logo