DC vs SRH | పరుగుల ఛేజింగ్‌లో దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ కేపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 10.5వ బంతికి శిఖర్ ధవన్ ( 42 ) క్యాచ్ ఔటయ్యాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 73 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌పై గెలవాలంటే ఢిల్లీ 54 బంతుల్లో 62 పరుగులు చేయాలి.