గురువారం 26 నవంబర్ 2020
Sports - Nov 02, 2020 , 19:06:05

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

అబుదాబి: ఐపీఎల్‌-13లో  మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు     జట్లు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో తలపడనున్నాయి.   ఈ ఆసక్తికర పోరులో   విజయం సాధించిన  జట్టు పాయింట్ల పట్టికలో  రెండో స్థానానికి చేరుకుంటుంది.  

టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు.  రహానె, అక్షర్‌ పటేల్‌, డేనియల్‌ శామ్స్‌ తుది జట్టులోకి వచ్చినట్లు శ్రేయస్‌ చెప్పాడు. మరోవైపు బెంగళూరు జట్టులోనూ మార్పులు జరిగినట్లు విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు. గుర్‌కీరత్‌ మన్‌, నవదీప్‌ సైనీ స్థానంలో శివమ్‌ దూబే, శాబాజ్‌ అహ్మద్‌ తుది జట్టులోకి వచ్చారు.